Nayanthara: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార. నాలుగు పదుల వయసుకు చేరువలోనూ చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా… ఇటీవల లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాది భాషల్లో అగ్రతారగా కొనసాగుతోంది. ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో సినీప్రియుల్ని మెప్పించే అందాల తార… ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.
Nayanthara Movie Updates
ప్రముఖ నిర్మాణ సంస్థ 7స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’, ‘మాస్టర్’ లాంటి విజయవంతమైన సినిమాలకు సాహిత్యం అందించిన విష్ణు… ఈ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నారు. ఇటీవలే నయన్ తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో ‘దాదా’ సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ కథానాయకుడు కవిన్ రాజ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలో అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు సమాచారం. ప్రస్తుతం ‘డియర్ స్టూడెంట్స్’, కమల్-మణిరత్నం కాంబోలో తెరకెక్కిస్తున్న థగ్స్ ఆఫ్ లైఫ్ చిత్రీకరణలో నయనతార బిజీగా ఉంది.
Also Read : Anand Mahindra: ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు !