Prabhas-Nayan : 17 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభాస్ సినిమాలో నయనతార..

ప్రభాస్‌,నయన్‌ 2007లో వచ్చిన 'యోగి' చిత్రంలో జంటగా నటించారు...

Hello Telugu - Prabhas-Nayan

Prabhas : డార్లింగ్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజాసాబ్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి నయనతార ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరిపారని తెలిసింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో పాటను చిత్రీకరించే అవకాశముంది.

Prabhas-Nayan Movie Updates

ప్రభాస్‌,నయన్‌ 2007లో వచ్చిన ‘యోగి’ చిత్రంలో జంటగా నటించారు. అంతా ఓకే అయితే మళ్లీ 17 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపించనున్నట్లు అవుతుంది. హారర్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఇందులో ఫస్ట్‌ సాంగ్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Chiranjeevi : ‘పుష్ప 2’ టీమ్ కి అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com