Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్.జె.శరవణన్ దర్శకత్వం వహించారు. నయనతార, ఆర్జే బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మధు, అభినయ, అజయ్ ఘోష్, తిరునవక్కరసు, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. 2020లో తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’గా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను… తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాకు అభిమానుల నుండి మంచి స్పందన రావడంతో తాజాగా ఈ ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్ గా ‘మూకుత్తి అమ్మన్ 2’ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాలో నయనతార ప్లేస్ లో త్రిషను తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
Nayanthara Movie Updates
అయితే ఏం జరిగిందో ఏమో గాని మరల ఆ స్థానాన్ని తిరిగి నయనతార(Nayanthara) కొట్టేసింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో పాటు‘మంచి కోసం దైవం చేసే యుద్ధం’అంటూ అందుకు సంబంధించిన గ్లింప్స్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. దీనితో నయనతార మరోసారి అమ్మవారి రూపంలో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. సినీ రంగంలో ఈ ఏడాది దాదాపు పది చిత్రాలతో జోరు ప్రదర్శిస్తున్న అగ్ర కథానాయికగా నయనతార రికార్డు సృష్టిస్తోంది. నాలుగు పదుల వయసులో కూడా రోజుకో కొత్త సినిమా విశేషాలతో తన అభిమానుల్లో ఆసక్తి పెంచుతూనే ఉంది.
Also Read : Srinidhi Shetty: టాలీవుడ్ లో శ్రీనిధీ శెట్టి డబుల్ ధమాకా ?