షారుక్ ఖాన్ తో కలిసి నటించింది తమిళ సినీ నటి నయనతార. ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. ఆమెతో పాటు అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కూడా నటించి మెప్పించింది. ఈ సమయంలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ నయన తార పేర్కొన్నట్లు పుకార్లు పెద్ద ఎత్తున వినిపించాయి.
దీనిని పటా పంచలు చేస్తూ నయన తార సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ప్రత్యేకించి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ ను ఆకాశానికి ఎత్తేసింది. తను గనుక సినిమాలో ఛాన్స్ ఇవ్వక పోయి ఉండి వుంటే మంచి సినిమాను మిస్ అయ్యేదానినంటూ పేర్కొంది.
సినిమా రంగం అన్నాక పుకార్లు, దుష్పచారం జరుగుతూనే ఉంటుందని, తాను వీటిని పట్టించు కోనని స్పష్టం చేసింది. ఆమె ఇటీవలే ఇన్ స్టా లో జాయిన్ అయింది. నటుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.
ఇద్దరి పిల్లలకు తల్లి అయినప్పటికీ నయన తార అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో జవాన్ లో నటించింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తాజాగా దర్శకుడు అట్లీ కుమార్ బర్త్ డే సందర్బంగా విషెస్ తెలిపింది. అద్భుతమైన ప్రతిభా నైపుణ్యం కలిగిన డైరెక్టర్ అంటూ పేర్కొంది నయనతార.