Nayanthara : నా తప్పు లేనప్పుడు అవతలి వారు ఎంతటివారైనా భయపడను

నాకుఆ అవసరం లేదు. నమ్మినదానికోసమే నేను గట్టిగా నిలబడ్డాను...

Hello Telugu - Nayanthara

Nayanthara : నా తప్పు లేనప్పుడు అవతలి వ్యక్తి ఎంత బలవంతుడైనా భయపడాల్సిన అవసరమేముంది అంటూ స్పందించారు నయనతార. తమిళ అగ్రహీరో ధనుష్‌ను ఉద్దేశించి ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. ‘నయనతార: బియాండ్‌ ద ఫెరీ టేల్‌’ డాక్యుమెంటరీకు సంబంధించిన కాపీరైట్‌ వివాదంతో నయనతార(Nayanthara), ధనుష్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ధనుష్‌ వ్యక్తిత్వాన్ని తప్పుపడుతూ తీవ్ర పదజాలంతో బహిరంగ లేఖను రాసిన నయనతార ఆ తర్వాత పలు వేదికలపై నుంచి ధను్‌షపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదంపై ఓ ఇంటర్వ్యూలో నయనతార మరోసారి మాట్లాడారు. తమిళ సినీ రంగంలో ప్రముఖుడు, అగ్రహీరో అయిన ధను్‌షను సవాల్‌ చేసేంత ధైర్యం మీకెలా వచ్చింది అని ప్రశ్నించగా, న్యాయం తనవైపు ఉందని బదులిచ్చారు. ‘ధను్‌షకు బహిరంగ లేఖ రాయడం నేను నా డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ప్రచారం కోసం చేసిన ఎత్తుగడ అని కొందరు అనుకుంటున్నారు.

Nayanthara Comment

నాకుఆ అవసరం లేదు. నమ్మినదానికోసమే నేను గట్టిగా నిలబడ్డాను. ధనుష్‌ నుంచి వీడియో క్లిప్స్‌కు సంబంధించిన అనుమతిని పొందేందుకు నేనూ, విఘ్నేశ్‌ చాలా రకాలుగా ప్రయత్నించాం. మాకు తెలియకుండా ఎప్పుడైనా ఆయన మనసు నొప్పించి ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందాం అనుకున్నాం. ఆయన్ను కలిసేందుకు చాలా ప్రయత్నించాం. పలుమార్లు ధను్‌షకు ఫోన్‌ చేశాం. అయినా ఆయన స్పందించలేదు. మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన నాకు మిత్రుడే. ఆయన కోపానికి కారణం నాకు తెలియదు’ అని నయనతార తెలిపారు.

Also Read : Allu Arjun Arrest : సంధ్య థియేటర్ వద్ద మహిళ మరణంపై హీరో ‘అల్లు అర్జున్’ అరెస్ట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com