సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు నయన తార. తను ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా ఫిట్ నెస్, అందం విషయంలో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లతో పోటీ పడుతోంది. అంతే కాదు మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాలలో కీలక రోల్ పోషిస్తోంది.
తాజాగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది జవాన్. దీనిని తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో పాటు దీపికా పదుకొనే నటించారు.
కానీ ఎక్కువ మార్కులు నయన తారకు వచ్చాయి. జవాన్ లో షారుక్ తో పోటీ పడి నటించింది. ఆమెకు 40 ఏళ్లు. జవాన్ బిగ్ సక్సెస్ కావడంతో నయన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా పలు సినిమాలలో నటించాలని ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ నయన్ ఒప్పుకోవడం లేదు. చాలా కండీషన్స్ పెడుతోందని వాపోతున్నారు.
తను సినిమా ప్రమోషన్స్ కు రానంటూ ముందుగానే చెబుతోంది. దీనికి కూడా దర్శక, నిర్మాతలు ఓకే చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్లు తీసుకుంటున్న నయన తార జవాన్ బిగ్ సక్సెస్ కావడంతో ఉన్నట్టుండి రెమ్యునరేషన్ రేటు ఏకంగా రూ. 20 కోట్లకు పెంచేసినట్లు టాక్. ఏ విషయంలో నో కాంప్రమైజ్ అంటోందంట.