దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు . ఆ నటి ఎవరో కాదు ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇంకా క్రేజ్ తగ్గని తార నయన తార. రోజు రోజుకు అందం రెట్టింపు అవుతోందే తప్పా ఎక్కడా తగ్గడం లేదు. ఈ అమ్మడికి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈ ఏడాది నయన్ కు భారీ సక్సెస్ వచ్చింది. డైనమిక్ , యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో నటించిన జవాన్.
ఇందులో బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి పోటీ పడి నటించింది. ఇది బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో నయన తార నటనకు జనం ఫిదా అయ్యారు. వంద మార్కులు వేశారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా నేషనల్ క్రష్ గా మారి పోయింది ఈ తార.
తాజాగా మరోసారి తన అంద చందాలతో మెరుపులు మెరిపించింది. పేరు పొందిన మ్యాగజైన్ ఎల్లే ఇండియా మ్యాగజన్ కవర్ పేజీ తళుక్కుమంది. వివిధ భంగిమలతో ఆకట్టుకుంది. హాఫ్ షర్ట్స్ తో సూపర్ గా కనిపించింది.
కుర్ర కారు గుండెల్ని మీటింది ఈ అమ్మడు. పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మడం లేదు. మొత్తంగా నయన తార మరోసారి వైరల్ కావడం విశేషం. నయనతార ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తోంది.