దక్షిణాదిలో అందాల తార నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా , తదితర నటీమణులు ఒక్కో సినిమాకు రేంజ్ ను బట్టి కనీసం రూ. 15 కోట్ల నుంచి రూ.20 కోట్ల దాకా తీసుకుంటున్నట్లు టాక్.
ఇక నయన తార ప్రస్తుతం తన సినీ కెరీర్ లో అరుదైన మైలు రాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 74 సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. సినీ ఇండస్ట్రీలో ప్రభు దేవా, శింబుతో పీకల లోతు దాకా ప్రేమలో పడినా వర్కవుట్ కాలేదు. చివరకు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. కవల పిల్లలకు జన్మనిచ్చింది నయన తార.
ఎవరైనా పిల్లల తల్లి అంటే నమ్మలేరు. లేటెస్ట్ గా దూసుకు పోతున్న కుర్ర హీరోయిన్లకు ధీటుగా నటనలో తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడింది నయనతార. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
తాజాగా నయనతార గురించి అప్ డేట్ వచ్చింది. 75వ సినిమా చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. హీరో, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరనే దానిపై ఇంకా వెల్లడి కాలేదు. ఈ మూవీ కోసం ఏకంగా భారీ ఎత్తున పారితోషకం నయనతార తీసుకుంటున్నట్లు టాక్.