Nayanatara: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార. నలభై ఏళ్ళ వయసుకు చేరువలోనూ చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా… ఇటీవల లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాది భాషల్లో అగ్రతారగా కొనసాగుతోంది. ఇటీవల తన ప్రేమికుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్ళి చేసుకోవడమే కాకుండా ఇద్దరు కవల పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను కూడా సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. అయితే ఇటీవల నవంబరు 18న 40వ ఏట అడుతపెట్టిన నయనతారకు తన భర్త విఘ్నేశ్ శివన్ ఖరీదైన జర్మనీ లగ్జరీ కార్ ను గిప్ట్ ఇచ్చారట. ఫుట్టిన రోజు కానుకగా తన భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ గురించి నయన్… తన సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Nayanatara – పుట్టిన రోజు గిఫ్ట్ గా జర్మనీ లగ్జరీ కార్
ఇటీవల (నవంబర్ 18) పుట్టిన రోజు జరుపుకున్న లేడీ సూపర్ స్టార్ కు సినీ ప్రముఖులు, అభిమానులు వివిధ వేదికల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే వారందికీ భిన్నంగా నయన్(Nayanatara) భర్త విఘ్నేశ్ శివన్… జర్మన్ లగ్జరీ కార్ గా చెప్పుకునే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును ఆమె పుట్టిన రోజు కానుకగా అందించారట. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే కారు ఫోటోను పోస్ట్ చేయనప్పటికీ కారు యొక్క బ్రాండ్ లోగోను మాత్రమే ఆమె షేర్ చేసారు. ఆ లోగో బట్టి ఆ కారు విలువ మూడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. దీనితో నెటిజన్లు లేడీ సూపర్ స్టార్ తో పాటు అతని భర్త విఘ్నేశ్ శివన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘అన్నపూరణి’ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నయనతార
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే… కింగ్ ఖాన్ షారూక్ తో ‘జవాన్’ సినిమాలో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన నయనతార…. ‘అన్నపూరణి’ గా శుక్రవారం (డిసెంబరు 1) నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కార్తీక్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి… ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుందో ఈ సినిమాలో చూపించారు. మరోవైపు, ‘కాతువాకుల రెండు కాదల్’తో గతేడాది విజయాన్ని అందుకున్న దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
Also Read : Animal: అడ్వాన్స్ బుకింగ్ లో ‘యానిమల్’ రికార్డ్