Navneet Kaur Rana: లోక్ సభ ఎన్నికల బరిలో యమదొంగ బ్యూటీ !

లోక్ సభ ఎన్నికల బరిలో యమదొంగ బ్యూటీ !

Hello Telugu - Navneet Kaur Rana

Navneet Kaur Rana: మరొకొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఈ సారి సినీతారలు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, సౌత్ ఇండియా సూపర్ లేడీ రాధిక శరత్‌కుమార్‌ కు బీజేపీ టికెట్స్ కేటాయించింది. హిమాచల్ ప్రదేశ్‌ లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్… తమిళనాడులోని విరుధునగర్ నుంచి రాధిక బరిలో నిలిస్తున్నట్లు ప్రకటించారు. అయితే బీజేపీ తాజాగా ప్రకటించిన లిస్ట్‌ లో మరో హీరోయిన్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ లోక్ సభలో అడుగుపెట్టిన హీరోయిన్ నవనీత్‌ కౌర్‌(Navneet Kaur Rana) కు… తాజాగా బీజేపీ టిక్కెట్టు ప్రకటించింది. అమరావతి నుంచే ఆమె బీజేపీ తరపున బరిలో దిగనున్నట్లు ఇటీవల ప్రకటించిన జాబితాలో వెల్లడించింది.

Navneet Kaur Rana in Lok Sabha Elections

మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన నవనీత్‌ కౌర్‌… శీనువాసంతి లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత జగపతి, దర్శనం, గుడ్ బాయ్స్, రూమ్ మేట్స్, మహారథి, జాబిలమ్మ లాంటి సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో కూడా ఆమె నటించింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన యమదొంగ సినిమాలో రంభ పాత్రలో అభిమానుల మనసులను కొల్లగొట్టింది. అయితే రాజకీయాలపై ఆశక్తితో 2019 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలో దిగి గెలిచింది. ప్రస్తుతం లోక్ సభ ఎంపీగా ఉన్న ఈమెకు బీజేపీ తరపున అధిష్టానం టిక్కెట్టు ప్రకటించింది. దీనితో ఆమె త్వరలో బీజేపీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది.

Also Read : Naga Chaitanya: మరోసారి థ్రిల్లర్‌ కథతో వస్తున్న నాగచైతన్య !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com