Naveen Polishetty : మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వం వహించిన మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి చిత్రం ఊహించని రీతిలో భారీగా ఆదరణ చూరగొంటోంది. ఆశించిన దానికంటే కలెక్షన్లు వస్తున్నాయి. దీనిని పూర్తిగా రొమాంటిక్, కామెడీ పరంగా తీశాడు దర్శకుడు. ఇందులో సక్సెస్ అయ్యాడు.
Naveen Polishetty Feels Happy
జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టికి ఈ చిత్రం మంచి సంతోషాన్ని కలిగించేలా చేసింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యింది. ఈ మూవీతో పాటు అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ కూడా విడుదలైంది. రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది. జవాన్ సునామీని తట్టుకుని నిలబడింది మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి చిత్రం.
ఇప్పటి దాకా ఈ చిత్రం రూ. 29 కోట్లకు పైగా వసూలు సాధించింది. బ్రేక్ ఈవెన్ రావడంతో మూవీ మేకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సిద్దూ పాత్రలో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), అన్విత పాత్రలో అనుష్క శెట్టి నటించారు. అన్విత తల్లిగా సహజ నటి జయసుధ, సిద్దు తండ్రి ఫణీంద్ర పాత్రలో మురళీ శర్మ, తల్లిగా తులసీ నటించారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి. మొత్తంగా ఈ క్రెడిట్ అంతా దర్శకుడు మహేష్ బాబుకు దక్కుతుందని పేర్కొన్నారు నవీన్ పోలిశెట్టి.
Also Read : Jailer Record : జైలర్ వసూళ్ల జైత్రయాత్ర