Game Changer:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కితోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ సోలోగా చేస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజు అందించిన కథకు అత్యాధునిక సాంకేతిక విలువలు జోడించి దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ను జరుపుకుంటోన్న గేమ్ చేంజర్ సినిమాని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Game Changer:
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి యంగ్ హీరో నవీన్ చంద్ర ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. గేమ్ చేంజర్(Game Changer) మూవీలో తాను కూడా నటిస్తున్నట్లు చెప్పాడు. అలాగే తన పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుందని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఆరంభంలో లో పాజిటివ్ గా ఉండే క్యారెక్టర్ తరువాత వైల్డ్ విలన్ గా రివీల్ అవుతుందని తెలిపాడు. ఆ సీక్వెన్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాలో హైలైట్ గా ఉండబోతోందని చెప్పాడు. దీనితో ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఎస్.జె.సూర్యతో పాటుగా నవీన్ చంద్ర కూడా ఒక విలన్ గా ఉండబోతున్నాడని అర్ధమవుతోంది.
నవీన్ చంద్ర ప్రస్తుతం సౌత్ లో లీడ్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు ఇతర హీరోల చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు. తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో కూడా నవీన్ చంద్ర మూవీస్ చేస్తూ ఉండటం విశేషం. రీసెంట్ అమెజాన్ ప్రైమ్ ఇన్ స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోస్ లో ట్రెండింగ్ లో ఉంది. గేమ్ చేంజర్ లో నవీన్ చంద్ర నటిస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read :-Harman Baweja: రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్!