Nani : శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. మూవీ మేకర్స్ మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మాస్ లుక్ తో అద్భుతమైన నటనతో కెవ్వు కేక అనిపించేలా నటించాడు నాని(Nani). దీంతో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. యూట్యూబ్ లో ఊహించని రీతిలో వ్యూస్ వస్తున్నాయి.
Nani Breaks Rowdy Boy’s Record
గతంలో ఉన్న రికార్డులను తిరగ రాసేందుకు దూసుకు పోతోంది హిట్ 3 . కేవలం 24 గంటల లోపే 17 మిలియన్లకు పైగా వ్యూస్ తో టీజర్ రికార్డ్ సృష్టించింది. ఇటీవల రౌడీ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ టీజర్ ను బ్రేక్ చేసింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. దర్శకుడి మేకింగ్, టేకింగ్ లో డిఫరెంట్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉండగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తీశాడు. ఇది కూడా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫిబ్రవరి 12న టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రౌడీ సూపర్ గా నటించాడు. మేకింగ్ డిఫరెంట్ గా ఉండడంతో టీజర్ ను ఎక్కువగా అభిమానులు ఆదరిస్తున్నారు.
Also Read : Hero Chiranjeevi-Rani Mukerji :మెగాస్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ