Natural Star Nani: ‘OG’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ !

‘OG’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ !

Hello Telugu - Natural Star Nani

Natural Star Nani: ‘దసరా’, ‘హాయ్ నాన్న’ విజయాలతో మంచి జోష్ మీద ఉన్న నేచురల్ స్టార్ నాని… ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నాడు. నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు… నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). గత కొంతకాలంగా టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న వార్తలకు అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ‘సరిపోదా శనివారం’ తరువాత నాని చేయబోయే ‘నాని32’ సినిమా వివరాలను వెల్లడించారు. నాని పుట్టినరోజును పురస్కరించుకుని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ‘నాని32’ చిత్ర ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది.

Natural Star Nani Movie Updates

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ‘నాని32’ ప్రాజెక్టు తెరకెక్కించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా ప్రకటనతో పాటు ఓ అనౌన్స్‌ మెంట్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో ఒక హింసాత్మకంగా ఉండే ఓ వ్యక్తి… అహింసాత్మక వ్యక్తిగా ఎలా మారాడు ? అతని ప్రపంచం ఎందుకు తలకిందులుగా మారుతుంది… అనే కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుందనే విషయాన్ని ఈ అనౌన్స్‌మెంట్ వీడియో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి నాని కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘ఇది సుజీత్‌ సినిమా… పవర్ తర్వాత లవర్‌ తో వస్తాడు’ అంటూ ‘ఓజీ’కి లింక్ పెడుతూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో నాని(Natural Star Nani) చేస్తున్న ‘సరిపోదా శనివారం’ పూర్తవగానే… ఈ సినిమా సెట్స్‌ పైకి వెళుతుందని మేకర్స్ తెలియజేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఇదే సంస్థ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా ‘OG’ను కూడా నిర్మిస్తున్నారు. దీనితో ‘సరిపోదా శనివారం’ హీరోను, ‘OG’ దర్శకుడ్ని పెట్టి ‘నాని32’ గా నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేసింది డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. వెంటవెంటనే ఇలా కాంబినేషన్ ఈ మధ్య కాలంలో కుదరడం లేదు. కాని డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్ మాత్రం అలా సెట్ చేసింది.

Also Read : Mammootty: ఖైదీగా మారిన స్టార్ హీరో !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com