Natural Star Nani: జెర్సీ సినిమాపై నాని ఎమోషనల్‌ పోస్ట్‌ !

జెర్సీ సినిమాపై నాని ఎమోషనల్‌ పోస్ట్‌ !

Hello Telugu - Natural Star Nani

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటించగా ఆయన సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌ లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్‌ షో వేశారు. దీనికి నాని-అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులు చూపిస్తోన్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Natural Star Nani Movie Updates

‘‘ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే… మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్‌ (సినిమాలో తన పాత్ర పేరు) తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’’ అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

అంజనా సైతం ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘తొలిసారి థియేటర్‌ లో ‘జెర్సీ’ సినిమా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్‌ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’’ అని రాసుకొచ్చారు.

నాని ప్రస్తుతం వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపిస్తున్న ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, ‘బలగం’ ఫేమ్‌ వేణుతో నాని సినిమాలు చేయనున్నారు.

Also Read : Hero Vijay: దళపతి హీరో విజయ్‌ పై కేసు పెట్టిన సామాన్యుడు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com