మరోసారి తన సత్తా ఏమిటో చూపించే ప్రయత్నం చేశాడు నేచురల్ స్టార్ నాని. తను కీలక పాత్రలో నటించిన హిట్ 3 మూవీకి సంబంధించి టీజర్ విడుదలైంది. కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇప్పటికే భిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా క్రియేటివిటీ కలిగిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు ఈ సినిమాకు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో లీనమై పోయి నటించాడు నాని. అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఉన్నాయి. హిట్ 3 చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కారుతో దూసుకు పోతున్న హిట్ ఆఫీసర్ సన్నివేశం మరింత ఉద్విగ్నంగా సాగేలా ఉంది.
ఒక్క టీజర్ దుమ్ము రేపేలా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తన పాత్ర అర్జున్ సర్కార్. ఇందులో ఇద్దరు పోటీ పడి నటించారు. వీడికి ఏ కేసు ఇచ్చినా అభ్యంతరం లేదు. కానీ వీడికి లాఠీ ఇస్తే మాత్రం దొరికినోడి పరిస్థితి మాత్రం తలుచుకుంటేనే భయంగా ఉందంటూ చెప్పిన డైలాగ్ గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయి. మొత్తంగా నేచురల్ స్టార్ మరోసారి తన స్టామినా ఏమిటో చూపించేందుకు సన్నద్దం అయ్యాడు .