National Crush Rashmika : రష్మిక ఆరోగ్యంపై కీలక అప్డేట్

తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక...

Hello Telugu - National Crush Rashmika

Rashmika : అందాల భామ రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే తాజగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ కాలికి గాయం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందన(Rashmika). ప్రస్తుతం ఈ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సికిందర్’ సినిమాతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక(Rashmika). యానిమల్ సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జతకడుతుంది. సల్మాన్, రష్మిక జంటగా తెరపై కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడు రష్మిక సినిమాకు బ్రేక్ ఇచ్చింది. జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడటంతో విశ్రాంతి తీసుకుంటుంది.

National Crush Rashmika Health Updates

జిమ్‌లో వ్యాయామ సమయంలో గాయం కారణంగా రష్మిక మందన విశ్రాంతి తీసుకుంటుంది. దాంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఈ ముద్దుగుమ్మే వెల్లడించింది. నటుడు తన కుడి పాదం కట్టుతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది. రష్మికాకు గాయం అవ్వడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రష్మిక తన పోస్ట్ కింద ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో మొదలైందని, అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నానని రష్మిక పేర్కొంది.

నేను ప్రస్తుతం ఆశ మోడ్‌లో ఉన్నాను. వారాలు లేదా నెలలు పట్టవచ్చు, దేవునికి మాత్రమే తెలుసు. నేను ఇప్పుడు థమ, సికందర్, కుబేర షూటింగ్ సెట్స్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించండి. నేను రికవర్ అయిన వెంటనే తిరిగి వస్తాను. అని రాసుకొచ్చింది రష్మిక మందన్న. ఇటీవలే రష్మిక మందన్న,సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న సికందర్ చివరి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ముంబైలో షూటింగ్ జరిపి.. చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న సమయానికి పూర్తి చేస్తారన్న నమ్మకంతో టీమ్ ఉంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సికందర్. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు కాజల్ అగర్వాల్, రష్మిక, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కూడా నటిస్తున్నారు.

Also Read : Victory Venkatesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com