Uppena Movie : ఎవరీ బుచ్చిబాబు అని అంతా ఆశ్చర్య పోయారు. సుకుమార్ శిష్యుడిగా పేరు పొందిన అతడు గుండెల్ని పిండేసేలా సినిమా తీశాడు. అదే ఉప్పెన. విశాఖ అంటే శ్రీశ్రీ గుర్తుకు వస్తాడు. విశాఖ అంటే భావుకుడు వంశీ సినిమాలు జ్ఞాపకానికి వస్తాయి. విశాఖ సముద్రాన్ని, దాని అలల్ని తెర మీద చూపించాడు. దానిని ప్రేమతో ముడి పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు.
Uppena Movie Nominated National Award
సినిమా యూత్ నే కాదు అందరినీ, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చేసింది. ప్రత్యేకించి కృతీ శెట్టి, వైష్ణవ్ తేజ్ కలిసి రొమాన్స్ ను పండించారు. ప్రతి నాయకుడిగా తొలిసారిగా తమిళ సినీ రంగంలో టాప్ లో కొనసాగుతున్న నటుడు విజయ్ సేతుపతి తీసుకు వచ్చాడు.
ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. కోట్లు కొల్లగొట్టింది. బాక్సులు బద్దలు కొట్టింది. ప్రేమ ఎప్పటికీ చెరిగిపోని అంశం అని మరోసారి నిరూపించాడు దర్శకుడు. బాల చందర్ మరో చరిత్ర ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా.
మత్స్యకారుల కుటుంబానికిచెందిన అబ్బాయి సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది. ఎన్ని అడ్డుంకుల్ని ఎదుర్కొంటుందనే కథను తీసుకుని సినిమాను మలిచాడు బుచ్చిబాబు. తాజాగా మరోసారి ఉప్పెన(Uppena Movie) చర్చనీయాంశంగా మారింది. కారణం జాతీయ స్థాయిలో పురస్కారానికి ఎంపికైంది.
Also Read : Kriti Sanan Mimi : కృతి సనన్ నటనకు ఫిదా