Bhairavam-Rohit : నెట్టింట తెగ వైరల్ అవుతున్న నారా రోహిత్ ‘భైరవం’ లుక్

ఈఫస్ట్ లుక్‌ని గమనిస్తే.. అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో రోహిత్ యాక్షన్-ప్యాక్డ్‌గా కనిపించారు...

Hello Telugu - Bhairavam-Rohit

Bhairavam : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం(Bhairavam)’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి రీసెంట్‌గా విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. బుధవారం మేకర్స్ నారా రోహిత్ ఫెరోషియస్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Nara Rohit-Bhairavam Movie Look

ఈఫస్ట్ లుక్‌ని గమనిస్తే.. అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో రోహిత్(Nara Rohit) యాక్షన్-ప్యాక్డ్‌గా కనిపించారు. ఈ సినిమాలో అతని పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ఈ ఫస్ట్ లుక్‌తో అర్థమవుతోంది. ఈ యాక్షన్ పార్ట్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మూవీలో ప్రముఖ తారాగణం, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఇటీవల విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్, అలాగే తాజాగా విడుదలైన నారా రోహిత్ లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేవిగా ఉన్నాయి.

ఇకఈ సినిమాలో నటించే మరో హీరో మనోజ్ మంచు ఫస్ట్ లుక్‌ను త్వరలోనే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ స్క్రీన్‌ను షేర్ చేసుకోడం సినీ అభిమానులకు కన్నుల పండగలా ఉండబోతోంది. ఈ కాంబినేషన్‌ని అస్సలు ఇంత వరకు ఎవరూ ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఈ ముగ్గురుతో విజయ్ కనకమేడల ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నారో.. అనేలా అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ మొదలైంది. ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనింగ్, సత్యర్షి-తూమ్ వెంకట్ డైలాగ్స్ రాసే బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Also Read : Spirit Movie : ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సినిమా నుంచి కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com