Paradise : టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని(Nani) గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తను నిర్మించిన చిత్రం కోర్ట్. అతి తక్కువ బడ్జెట్ తో పోక్సో చట్టం ఆధారంగా కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ జగదీశ్. ఇందులో హర్ష వర్దన్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. ఇది విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాదు ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా కోర్ట్ ను రూ. 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇది అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది.
Nani Paradise Movie release Updates
ఇదే సమయంలో నాని కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం హిట్ 3. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ అనిపించేలా దర్శకుడు చిత్రీకరించాడు. ఇప్పటికే అంచనాలు మరింత పెరిగాయి. ఇంకో వైపు మరో సినిమా చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్యారడైజ్ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ ఇందుకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు స్వయంగా నాని. షూటింగ్ కొనసాగుతోందని, పక్కాగా ఇప్పటికే ప్రకటించిన మేరకే ప్రేక్షకుల ముందుకు వస్తామన్నాడు.
స్పెషల్ గా ది ప్యారడైజ్(Paradise) చిత్రానికి సంబంధింది అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశాడు. దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తుంది ఈ మూవీ. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కెవ్వుకేక అనిపించేలా చేసింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అద్భుతమైన పిక్చరైజేషన్, అంతకు మించిన డైలాగులు , ఎడిటింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్. ఇది మ్యాజిక్ చేసేలా ఉంది. మార్చి 26,2026లో రిలీజ్ కానుంది ప్యారడైజ్.
Also Read : Hero Chiranjeevi-Vishwambhara :మెగాస్టార్ విశ్వంభరపై ఓటీటీలు ఫోకస్