Hero Nani -Hit 3 :మే1న రిలీజ్ కానున్న నాని హిట్-3

నేచుర‌ల్ స్టార్ మూవీపై భారీ అంచ‌నాలు

Hero Nani -Hit 3

Hit 3 : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ క‌లిగిన న‌టుడిగా గుర్తింపు స్వంతం చేసుకున్న న‌టుడు నాని. త‌ను ఏరికోరి క‌థ‌లు ఎంచుకుంటాడు. ఈ మ‌ధ్య‌న న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా కొత్త అవ‌తారం ఎత్తాడు. త‌ను తీసిన కోర్ట్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్ ను స్వంతం చేసుకుంది. ఇక త‌ను కూడా బిజీగా మారి పోయాడు. వ‌రుస సినిమాల‌తో హొరెత్తిస్తున్నాడు. త‌న చేతిలో ప్ర‌స్తుతం ది ప్యార‌డైజ్ తో పాటు హిట్ 3(Hit 3) మూవీస్ ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.

Nani – Hit 3 Release Updates

ఈ సంద‌ర్బంగా తాజాగా హిట్ 3 చిత్రం గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ మూవీని మే1న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప‌రిశోధనాత్మ‌క యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు ద‌ర్శ‌కుడు . ఈ మూవీపై భారీ న‌మ్మ‌కం పెట్టుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే సినిమా సెన్సార్ స్క్రీనింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి త‌ను కూడా హాజ‌ర‌య్యారు. ఏమైనా అభ్యంత‌రాలు ఉన్నా లేదా మార్పులు చేయాల‌న్నా చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు సూచించారు న‌టుడు నాని.

హిట్ 3 మూవీని స్క్రీనింగ్ చూసిన క‌మిటీ ఇందులో మితి మీరిన హింస ఉంద‌ని, ఇది ప్రేక్ష‌కుల‌కు మంచిది కాద‌ని కూడా సూచించిన‌ట్లు టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌కారంగా చూస్తే భారీ ఎత్తున క‌ట్స్ ఉండ‌బోతున్న‌ట్లు టాక్. కాగా హిట్ 3ని వాల్ పోస్ట‌ర్ సినిమా నిర్మిస్తుండ‌గా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాని స‌ర‌స‌న అందాల తార శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. అబ్ కీ బార్ అర్జున్ స‌ర్కార్ రిలీజ్ చేసిన సాంగ్ కు ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు నాని.

Also Read : Beauty Tamannaah :కిక్కెస్తున్న మిల్కీ బ్యూటీ న‌షా సాంగ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com