Hit 3 : దసరా ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన మూవీ హిట్ 3. ఇందులో నాని , శ్రీనిధి శెట్టి కీ రోల్స్ పోషించాడు. తాజాగా మూవీ మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. చిత్రానికి సంబంధించిన ట్రౌలర్ ను రిలీజ్ చేశారు. పూర్తిగా హింస్మాత్మకంగా ఉంది. సెన్సార్ బృందం ఎలా సర్టిఫికెట్ ఇచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు సంబంధించి బూతులు, హింస ఎక్కువగా ఉంటున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి తాము తీస్తున్నామంటున్నారు దర్శక , నిర్మాతలు.
Hit 3 Movie Trailer Updates
బొమ్మరిల్లు భాస్కర్ తీసిన జాక్ మూవీలో కూడా బూతులతో రెచ్చి పోయాడు సిద్దూ జొన్నలగడ్డ. దీనిని వెనకేసుకు వచ్చారు నటుడు. పాత్ర కోసం అలా మాట్లాడాల్సి వచ్చిందన్నాడు. ఇంకా ముందుకు పోయి నిర్మాత నాగవంశీ అయితే ఏకంగా హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య రాబోయే మూవీలో ఇంకా పెద్ద ఎత్తున బూతులు మాట్లాడుతుందని సెలవిచ్చారు. సభ్య సమాజానికి ఆయన ఏం సందేశం ఇవ్వాలని అనుకున్నాడో తనకే తెలియాలి. తాము ఏది చూపిస్తే అది చూసేందుకు జనం ఎగబడతారని అనుకోవడం భ్రమ.
ఆయా సినిమాలు కొంత కాలం వరకే నిలబడతాయి. ఆ తర్వాత కాలగర్భంలో కలిసి పోతాయి. అలాంటి మూవీస్ కోకొల్లలు. ఇక హిట్ 3(Hit 3) విషయానికి వస్తే వచ్చే నెల మే1న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. ఇక నాని నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాను తీసిన కోర్ట్ బిగ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఈవెంట్ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశాడు. ఈ సినిమా నచ్చక పోతే హిట్ 3 చూడొద్దంటూ కోరాడు.
Also Read : Hero Jr NTR-War 2 :హై ఓల్టేజ్ పెంచుతున్న తారక్ వార్ -2