Hero Nani-Hit 3 Song :నాని జోరు ‘అబ్కీ బార్ అర్జున్ స‌ర్కార్’ జోష్

విడుద‌లైన పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న

Hero Nani-Hit 3 Song

Hit 3 : నేచుర‌ల్ స్టార్ నాని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. త‌ను ఓ వైపు సినిమాల‌లో బిజీగా ఉంటూనే మ‌రో వైపు కొత్త మూవీస్ క‌థ‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. ప్ర‌తిభ ఉండి అవ‌కాశాలు లేని వాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నాడు. వారిని తెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నాడు. తానే ఓ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి మూవీస్ ను నిర్మిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌లే త‌న నిర్మాణ సార‌థ్యంలో వ‌చ్చిన చిత్రం కోర్ట్. ఇది బంప‌ర్ హిట్ గా నిలిచింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఓటీటీ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. చాలా త‌క్కువ బ‌డ్జెట్ తో తీసిన ఈ మూవీ క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 8 కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం విస్తు పోయేలా చేసింది.

Hit 3 – Abki Baar Arjun Sarkar Song Viral

ఇక నాని(Nani) వ‌ర‌కు వ‌స్తే త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తూ సంచ‌ల‌నం రేపాడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన త‌ను న‌టించిన ప్యార‌డైజ్ చిత్రం టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా సాగింది. బ‌ల‌వంతుల‌ను ధిక్క‌రించే ఓ సామాన్యుడి పాత్ర‌ను పోషించాడు. తన‌కు నేచుర‌ల్ స్టార్ అన్న పేరుంది. కానీ ఇప్పుడు మ‌రీ వ‌యొలెంట్ గా త‌యార‌య్యాడు. అలాంటి పాత్ర‌లు పోషిస్తున్నాడు. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ పండిస్తున్నాడు నాని. ఇంకో వైపు హిట్ -3 సీక్వెల్ మూవీతో ముందుకు వ‌స్తున్నాడు. ఇది కూడా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ద‌స‌రా మూవీతో దుమ్ము రేపిన నాని ఇప్పుడు హిట్ 3తో మ‌రో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ మేక‌ర్స్ సూప‌ర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అదే అబ్కీ బార్ అర్జున్ స‌ర్కార్ అంటూ. శ‌త్రువుల‌పై ప్ర‌తీకారం త‌ప్ప‌దంటూ సాగింది ఈ మూవీ సాంగ్. దీనిని కృష్ణ‌కాంత్ రాయ‌గా మిక్కీ జే మేయ‌ర్ స్వ‌ర ప‌రిచారు. సినిమాకు సంబంధించి మ‌రో కీల‌క అప్ డేట్ కూడా వ‌చ్చింది. ఈనెల 14న హిట్ -3(Hit-3) ట్రైల‌ర్ రిలీజ్ కానుంద‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Sumaya Reddy Shocking :తెలుగు అమ్మాయిలంటే చుల‌క‌న

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com