Nani : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలిగిన నటుడు నాని. తనకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే తనకో పేరుంది. అదే నేచురల్ స్టార్(Nani). తను నటనతో పాటు నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తను పట్టిందల్లా బంగారం అవుతోంది ప్రస్తుతం. తాజాగా తను తీసిన చిత్రం కోర్ట్. దీనికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలు భారీ విజయాలను స్వంతం చేసుకున్నాయి.
Hero Nani Comments
వాటిలో ప్రదీప్ రంగనాథన్ , కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటించిన డ్రాగన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 130 కోట్లు వసూలు చేసింది. ఇదే సమయంలో రిలీజ్ అయిన చిత్రం కోర్టు కూడా. ఇది కూడా అంచనాలు తలకిందులు చేస్తూ బిగ్ సక్సెస్ సాధించింది. ఇదే సమయంలో నాని నటించిన చిత్రాలపై ఫ్యాన్స్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. తను నటించిన హిట్ -3 మూవీ తో పాటు ది ప్యారడైజ్ చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ కెవ్వు కేక అనేలా ఉన్నాయి. దీంతో మనోడి స్టార్ డమ్ మరింతగా పెరిగేలా చేసింది నానికి.
ఈ సందర్బంగా చిట్ చాట్ చేశాడు నేచురల్ స్టార్. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తన శరీర ఆకృతి గురించి. తను సింపుల్ గా ఉండే పాత్రలను ఎంచుకుంటానని, కానీ అనుకోకుండా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నటన కంటే హీరోకు శరీరాకృతి కూడా ముఖ్యమేనని చెప్పాడని అన్నారు. దీంతో ది ప్యారడైజ్ లో శరీరాన్ని ప్రదర్శించక తప్పలేదన్నాడు. ఇది కేవలం మూవీ పరంగా కథకు ఉండాల్సి రావడంతో తను అలా చేయాల్సి వచ్చిందన్నాడు నాని. ఈ క్రెడిట్ అంతా శ్రీకాంత్ ఓదెలకు దక్కుతుందన్నాడు నేచురల్ స్టార్.
Also Read : Popular Director RGV :రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట