Nandamuri Kalyan Ram: రూ.8 కోట్ల ఖర్చు, వెయ్యిమంది ఫైటర్స్ లో కళ్యాణ్ రామ్ క్లైమాక్స్‌ ఫైట్ !

రూ.8 కోట్ల ఖర్చు, వెయ్యిమంది ఫైటర్స్ లో కళ్యాణ్ రామ్ క్లైమాక్స్‌ ఫైట్ !

Hello Telugu - Nandamuri Kalyan Ram

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఎన్‌కేఆర్‌ 21’ (వర్కింగ్‌ టైటిల్‌). ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ సరసన సయీ మంజ్రేకర్‌ నటిస్తుండగా… విజయశాంతి, శ్రీకాంత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌ పూర్తయినట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది.

Nandamuri Kalyan Ram Movie Updates

‘‘క్లైమాక్స్‌ కోసం బ్రహ్మ కడలి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. పతాక సన్నివేశాల షూట్‌ లో ప్రముఖ తారాగణంతోపాటు దాదాపు వెయ్యి మంది జూనియర్‌ ఆర్టిస్టులుపాల్గొన్నారు. ఈ క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశాం. రామకృష్ణ యాక్షన్‌ కొరియోగ్రఫీని పర్యవేక్షించారు’’ అని యూనిట్‌ పేర్కొంది. యాక్షన్‌ ప్రాధాన్యమున్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ శక్తిమంతమైన పాత్రలో… కొత్త లుక్‌తో కనిపించనున్నారు. విజయశాంతి ఆయన సోదరిగా వైజయంతీ ఐపీఎస్‌ అనే పాత్రతో అలరించనుంది. ఈ చిత్రానికి సంగీతం అజనీష్‌ లోక్‌నాథ్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా రామ్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తున్నారు.

Also Read : Charu Haasan: ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు, సుహాసిని తండ్రి !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com