Balakrishna : హైదరాబాద్ – ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు బతికే ఉంటారని అన్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna). ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ కుటుంబీకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
Balakrishna Pays Tribute to Sr NTR…
యావత్ ప్రపంచంలోని తెలుగు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అన్నారు. వారంతా ఎన్టీఆర్ కుటుంబమేనని స్పష్టం చేశారు నందమూరి బాలకృష్ణ. తను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశాన్ని నివ్వెర పోయేలా చేశాయని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు చట్ట సభల్లో అవకాశం కల్పించడం, కొన్ని తరాలకు సరిపడా నాయకులను తయారు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు నందమూరి బాలయ్య.
కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తీసుకు వచ్చిన చరిత్ర తన తండ్రికి మాత్రమే ఉందన్నారు. ఇప్పటి వరకు ఆ రికార్డు దరి దాపుల్లోకి రాలేక పోయారని చెప్పారు.
కొన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పరితపించిన గొప్ప మానవుడు, మహోన్నత నాయకుడు నందమూరి తారక రామారావు అని. ఆయనకు లేరెవ్వురు సాటి అంటూ పేర్కొన్నారు.
Also Read : Legendary Actor NTR : యుగ పురుషుడు ఎన్టీఆర్