Namitha: కోలీవుడ్ లో విడాకుల సీజన్ నడుస్తోంది. ఇటీవలే ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్, జీవీ ప్రకాష్ కుమార్-సైంధవీ లు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బొద్దుగుమ్మ నమిత కూడా తన భర్తలో విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే నమిత నుండి గాని, ఆమె భర్త వీరేంద్ర చౌదరి నుండి కాని ఎటువంటి స్పందన లేకపోవడంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమనే చర్చ జరిగేది. అయితే సినిమాలతో పాటు ఇటీవలే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా మారిన నమిత… ఎట్టకేలకు తమ విడాకుల రూమర్స్ పై స్పందించింది. ‘ఈ మధ్యే భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను. ఇప్పుడొచ్చిన దానితో నేను-నా భర్త ఏం బాధపడట్లేదు. ఫుల్లుగా నవ్వుకున్నాం’ అని నమిత చెప్పుకొచ్చింది. దీనితో తమ విడాకులపై వస్తున్న రూమర్స్ కు బొద్దుగుమ్మ చెక్ పెట్టినట్లైయింది.
Namitha…
గుజరాత్ కు చెందిన నమిత(Namitha) వాంక్వాలా… 2002 లో ‘సొంతం’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, జెమిని సినిమాలతో గుర్తింపు పొందింది. నమిత పేరు కలిసి రాకపోవడంతో మధ్యలో తన పేరును భైరవిగా మార్చుకుంది. అయితే అదీకూడా కలిసిరాకపోవడంతో తిరిగి నమితగానే కొనసాగుతోంది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించి అక్కడే పూర్తిగా సెటిలైపోయింది. 2009లో ప్రభాస్ నటించిన బిల్లా, 2010లో నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసింది. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న నమిత… తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో నమిత స్పందించాల్సి వచ్చింది.
Also Read : Ravi Teja: హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న రవితేజ !