Namitha: మధుర మీనాక్షి దేవాలయ సిబ్బందిపై ప్రముఖ దక్షిణాది తార నమిత అసహనం వ్యక్తం చేసారు. దర్శనానికి వెళ్లిన ఆమెను లోపలికి అనుమతించలేదని, అగౌరవంగా మాట్లాడారని నమిత(Namitha) ఆరోపిస్తూ అక్కడి సిబ్బందిపై మండిపడ్డారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా. అయితే నాతో పాటు ఫ్యామిలీని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. నాతో దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతోనే హిందువును. అలాంటి నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను నేను సందర్శించినట్లు చెప్పా. ఆ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా’’ అని నమిత పేర్కొన్నారు.
Namitha Comment
ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. ‘‘నమిత(Namitha)తో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాం. కొంతసేపటి తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం’’ అని తెలిపారు.
సొంతం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నమిత… జెమినీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత విజయాలు దక్కలేదు. అయితే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో సన్నగా నజూకుగా జీరో సైజులో ఉండే ఈమె… ఆ తరువాత బొద్దుగా తయారయింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఆమెకు అభిమానులు కోవెలను కూడా కట్టారు. అయితే సింహా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన నమిత… సెకండ్ ఇన్సింగ్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ కాస్త బిజీగా ఉండి. మరోవైపు భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన ఈమెకు చేదు అనుభవం ఎదురైంది.
Also Read : Megastar Chiranjeevi: అభిమాని కుటుంబానికి మెగాస్టార్ ‘చిరు’ సత్కారం !