సినిమాల్లోని పాటల కంటే యూట్యూబ్ లో వస్తున్న ప్రేమ, జానపద పాటలకు ఎక్కువ క్రేజ్ ఉంటోంది. ఇప్పుడు తెలంగాణ యాస లేకుండా సినిమాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు ఇదేం భాష అన్న వాళ్లే పనిగట్టుకుని తమ సినిమాలలో ఉండేలా చూసుకుంటున్నారు.
ఎందుకంటే నైజాం ఏరియా అంతా సినిమాకు సంబంధించి ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకే నిర్మాతలు కూడా వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. దర్శకులకు ఇష్టం లేక పోయినా సరే అంటున్నారు.
ఇక తెలంగాణ జానపదాలకు కేరాఫ్ గా మారి పోయింది యూట్యూబ్. తాజాగా బుల్లి తెరపై తమ నటనతో ఆకట్టుకుంటున్న అమర్ దీప్ చౌదరి, ప్రియాంక ఎం జైన్ కలిసి నటించిన నల్ల నల్ల మబ్బుల్లా సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇప్పటికే 12 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు. తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ పాటలో ఒకరిని మించి మరొకరు లీనమై నటించారు. ప్రేమను పండించారు. కుర్ర కారును, యువతను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అంతే కాదు వెబ్ స్టోరీస్ లో కూడా ట్రెండింగ్ లో ఈ పాట కొనసాగుతోంది. టాలెంట్ ఉంటే చాలు ఫేమ్ తానంతట అదే వస్తుందని ఈ పాటను చూస్తే తెలుస్తుంది.
కుమార్ కోట ఈ పాటను రాస్తే ఎస్ కే మదీన్ సంగీతం అందించారు. నివృత్తి వైబ్స్ నిర్మించింది. నల్ల నల్ల మబ్బుల్లా పాటను హన్మంత్ యాదవ్ , అపర్ణ నందన్ పాడగా రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించారు.