Nagarjuna Dhanush : కింగ్ నాగార్జున ఇటీవల నా సామిరంగా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు నాగార్జున ధనుష్‌తో సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Nagarjuna Dhanush Viral In Kapila Theertham
ఈ సినిమా చివరి షూటింగ్ తిరుపతిలో జరుగుతుంది. తిరుపతిలోని కపిల తీర్థం నంది సర్కిల్‌లో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందుకు ఉదయం నుంచే పోలీసులు వాహనాలను తిరుమల వైపు దారి మళ్లించారు.అయితే విద్యార్థులు, సిబ్బంది, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది భక్తులు నచ్చకపోయినప్పటికీ… అన్ని అనుమతులతో సినిమా షూటింగ్ చేస్తున్నామని ఫిల్మ్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.
Also Read : Chiru Vishwambhara : ‘విశ్వంభర’ సినిమాలో చిరు ని ఢీకొట్టే విలన్ గా కోలీవుడ్ అగ్ర హీరో