Nagarjuna : తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. నాగార్జున తరపున వాదనలను సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని మంగళవారం నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. దీంతో కోర్ట్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది. దీంతో నాగార్జున ఈరోజు కోర్ట్‌కు హాజరయ్యారు.
Nagarjuna Visit…
తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా.. తాజాగా హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Also Read : Pushpa 2 Movie : బన్నీ పుష్ప 2 సినిమా నుంచి కీలక అప్డేట్