Nagarjuna Akkineni: బ్యాంకాక్‌ లో కింగ్ నాగార్జున యాక్షన్ షురూ !

బ్యాంకాక్‌ లో కింగ్ నాగార్జున యాక్షన్ షురూ !

Hello Telugu - Nagarjuna Akkineni

Nagarjuna Akkineni: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున కథానాయకులుగా… ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘కుబేర’. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ సన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన వచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సామాజిక అంశాలను స్పృశిస్తూ… ధనుష్, నాగార్జునలను మునుపెన్నడూ చూడని యాక్షన్ మోడ్ లో చూపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో తేట తెల్లమయింది. దీనితో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Nagarjuna Akkineni Shooting

అయితే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్… ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకాక్ వేదికగా ధనుష్, నాగార్జులతో(Nagarjuna Akkineni) పాటు మరికొంతమంది కీలక నటులతో షూటింగ్ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బ్యాంకాక్ లో కింగ్ నాగార్జునకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారని సమాచారం. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో బ్యాంకాక్ అయితే ధనుష్ తో పాటు నాగ్ ను కూడా సరికొత్త లుక్ లో చూడొచ్చని అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Chaithra J Achar: ‘బ్రా’లో ఫోట్ షూట్ చేసి అరాచకం సృష్టిస్తోన్న కన్నడ బ్యూటీ !

 

 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com