Naga Vamshi : ప్రముఖ సినీ నిర్మాత, సితార బ్యానర్ ఎంటర్ టైనర్ ఓనర్ నాగవంశీ(Naga Vamshi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను నిర్మించిన తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. పెద్ద ఎత్తున కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీని మార్చి 28న విడుదలైంది. భారీ సక్సెస్ కావడంతో చిట్ చాట్ చేశాడు నిర్మాత. ఎవరి అభిప్రాయాలు వారివని, వారిని గౌరవిస్తామని అన్నారు. ఇక సినిమాలకు సంబంధించి చేసే రివ్యూల గురించి కూడా సంచలన కామెంట్స్ చేశాడు. నెగటివ్ రివ్యూస్ గురించి తాను పట్టించుకోనని అన్నారు. వాటిని తాను పూర్తిగా వారి కోణంలోనే చూసేందుకు ప్రయత్నం చేస్తానన్నాడు.
Producer Naga Vamshi Comments
ప్రధానంగా వారు చేసే వ్యతిరేక ప్రచారం వల్ల సినిమా ఆడుతుందా లేదా అన్నది శుద్ద దండగ అన్నారు. ఎందుకంటే తాము కంటెంట్ ను చూస్తామన్నాడు. కథ బాగుంటే చిత్రం బిగ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం తనకు ఉంటుందన్నారు. సినీ రంగానికి చెందిన రివ్యూయర్స్ ఈ పరిశ్రమపై ఆధారపడిన వాళ్లు వేలాది మంది ఉన్నారని, సినిమాలు ఆడితేనే వీరు బాగుంటారని ఆ విషయం తెలుసుకుని రాస్తే మంచిదని హితవు పలికారు నిర్మాత నాగ వంశీ.
నిజాయితీగా అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పారు. విచిత్రం ఏమిటంటే కావాలని కొందరు పనిగట్టుకుని సినిమాలను చంపేయాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని హితవు పలికారు. సినిమాలను ఆదరించాలి. ప్రేమించాలి..వాటిని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేయాలే తప్పా వాటిని ఆడకుండా చేయాలని అనుకోకూడదని పేర్కొన్నారు . తాను ప్రీ రిలీజ్ సందర్బంగా తమ సినిమా గురించి పక్ఆక సక్సెస్ అవుతుందని చెప్పానని, తాను చెప్పినట్టుగానే మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందన్నారు.
Also Read : Hero Allu Arjun-Trivikram :బన్నీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కన్ ఫర్మ్