Naga Shaurya: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నట నటుడు దర్శన్ పై టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనితో కర్ణాటక పోలీసులు దర్శన్, పవిత్ర గౌడతో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈకేసులో విచారణ జరుగుతోంది. కానీ బయటకొస్తున్న రోజుకో ఫొటో, న్యూస్ దర్శన్ అంటే అసహ్యం కలిగేలా చేస్తోంది. ఇలాంటి టైంలో దర్శన్ కి సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.
Naga Shaurya…
టాలీవుడ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) తన సోషల్ మీడియా వేదికగా… ‘చనిపోయిన వ్యక్తి (రేణుకాస్వామి) కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అయితే ఈ కేసులో అందరూ అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు చాలా నచ్చేలేదు. ఎందుకంటే దర్శన్ అన్న ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టే వ్యక్తి కాదు. కలలో కూడా అలాంటి పనిచేయరు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ఎంత మంచివాడో పరిచయమున్న వాళ్లకు తెలుసు. చాలామందికి కష్టకాలంలో తోడున్నాడు. కానీ నేను ఈ వార్తల్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకముంది. త్వరలోనే నిజం బయటపడుతుంది’ అని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసారు.
‘ఈ కేసు వల్ల మరో కుటుంబం (దర్శన్ ఫ్యామిలీ) కూడా బాధపడుతోందని మనం గుర్తుంచుకోవాలి. వాళ్లకు ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ప్రైవసీ కావాలి. మీపై నాకు నమ్మకముంది అన్న. మీరు అమాయకుడు అనేది తేలుతుంది. అసలు నేరస్థుడు ఎవరనేది త్వరలోనే బయటపడుతుంది’ అని నాగశౌర్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం నాగశౌర్య పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దర్శన్ నిందితుడు అని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ దొరికిన ఆధారాలు బట్టి అభిమానిని ఎంత దారుణంగా హత్య చేశాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఇలాంటి టైంలో హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఎంత అభిమానం ఉన్నాసరే కొన్నిసార్లు దాన్ని దాచుకోవాల్సి ఉంటుంది. ఇలా రాంగ్ టైంలో పోస్ట్ పెడితే లేనిపోని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read : Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి !