Naga Chaitanya : తాజాగా హైదరాబాద్‌లో జరిగిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం సినిమా ‘క’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరో నాగ చైతన్య , ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హీరో కిరణ్ అబ్బవరం స్పీచ్‌తో పాటు గెస్ట్ నాగ చైతన్య(Naga Chaitanya) స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. దీంతో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌తో పాటు చైతన్య ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నరు.
Naga Chaitanya Comment
హీరో నాగ చైతన్య(Naga Chaitanya) మాట్లాడుతూ.. “నేను ఇంట్రోవర్ట్ పర్సన్‌ని . కొత్త వాళ్లతో పెద్దగా కలవను. అయితే రీసెంట్గా కిరణ్ చెన్నైలో కలిశాడు. అతనితో మాట్లాడిన కొద్దిసేపటికే చాలా దగ్గరి ఫ్రెండ్‌లా అనిపించాడు. తనకు నా వల్ల అయిన సపోర్ట్ చేయాలనిపించింది. కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్‌ను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో మంచి ప్రొటెక్షన్‌తో వచ్చాను. తనకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఎదిగాడు. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్సిపిరేషన్‌గా నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమందికి కిరణ్ స్ఫూర్తిగా నిలుస్తారు. ఇలాంటి హీరోస్ సక్సెస్ కావాలి. నేను ‘క’ సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. కిరణ్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్‌కు గెస్ట్‌గా రావాలని పిల్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. ఇలాంటి మంచి మూవీ ప్రమోషన్లో భాగమవడం సంతోషంగా ఉంది.
కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క సినిమా ప్రీ రిలీజ్‌కు వెళ్తున్నానని ఒక ఫ్రెండ్‌కు చెబితే కిరణ్ అబ్బవరం క సినిమానా అన్నారు. అంటే సినిమా ముందు నీ పేరు రికగ్నైజ్ అవుతోంది. నువ్వు ఆ గుర్తింపు తెచ్చుకున్నావు. నీ ఇంటర్వ్యూస్ చూశాను. ఎంతో ర్యాగింగ్ ప్రశ్నలకు కూడా మెచ్యూర్డ్‌గా సమాధానాలు చెప్పావు. నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ జర్నీ అమేజింగ్. ట్రోల్ చేసే వారికి కీ బోర్డ్ తప్ప బ్రెయిన్లో ఏమీ ఉండదు. ట్రోల్స్‌కు భయపడే స్థాయి దాటేశావు. ఫ్లాప్స్, హిట్స్ ఎవరికైనా కామన్. ప్రతి వారి సక్సెస్ వెనకాల మహిళ సపోర్ట్ ఉంటుంది. కిరణ్‌కు వాళ్ల అమ్మతో పాటు రహస్య సపోర్ట్ కూడా దొరికింది. ‘ క’ సినిమా టీమ్ ను కలిసినప్పుడు వారు సినిమా కోసం ఎంత హానెస్ట్‌గా కష్టపడ్డారో తెలిసింది. ‘ క’ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. ” క” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా” అన్నారు.
Also Read : Ka Movie : తమిళ ఇండస్ట్రీలో తెలుగు సినిమాకి అవమానం