Naga Chaitanya : నటుడు అక్కినేని నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్రభు గురించి సాఫ్ట్ గా స్పందించడం విస్తు పోయేలా చేసింది. తామిద్దరు కలిసి డైనమిక్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాలో నటించారు. దీనిని దృశ్య కావ్య చిత్రంగా తెరకెక్కించాడు. సంగీతం, డైలాగులు, పాటలు జనాదరణ పొందాయి. నేటికీ టాప్ లో కొనసాగుతుండడం విశేషం. అల్లా రఖా రెహమాన్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడు జీవం పోశాడు.
Naga Chaitanya Shocking Comments
సినిమా బిగ్ సక్సెస్ కావడంతో నాగ చైతన్య(Naga Chaitanya) సమంత రుత్ ప్రభు మధ్య కొంత ప్రేమ చిగురించింది. ఇద్దరూ సినిమాలలో బిజీగా ఉంటూ వచ్చారు. ఎవరికి వారు నటించడంపై ఫోకస్ పెట్టారు. ఉన్నట్టుండి ప్రేమలో ఉన్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఇద్దరి మ్యారేజ్.
ఇదే సమయంలో కొంత కాలం అయ్యాక సమంత రుత్ ప్రభు ఉన్నట్టుండి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. తామిద్దరం దూరంగా ఉంటున్నామని పేర్కొంది. ఇద్దరి వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమంత ఒంటరిగా ఉంటే నాగ చైతన్య ఇటీవల మరో నటి శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ మూవీ విడుదలైంది. పెద్ద ఎత్తున సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా చిట్ చాట్ లో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, విడి పోవడం అత్యంత బాధాకరమని , ఇది తనను మరింత ఇబ్బంది పెట్టిందని వాపోయాడు నాగ చైతన్య. తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Also Read : Hero Nikhil Slams :లావణ్య లీక్స్ పై నిఖిల్ సిద్దార్థ్ ఫైర్