Naga Chaitanya : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన సాయి పల్లవి, నాగ చైతన్య(Naga Chaitanya) కాంబినేషన్ మరోసారి అద్బుతమైన కథా చిత్రం తండేల్ గా రాబోతోంది. త్వరలో గుండెల్ని మీట బోతోంది. సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. పరిణతి చెందిన నటిగా ఇప్పటికే గుర్తింపు పొందింది. కేవలం పాత్రలకు గౌరవం ఉండేలా , బలమైన వ్యక్తిత్వం కలిగిన సినిమాలను ఎంచుకుంటోంది.
Hero Naga Chaitanya, Sai Pallavi Thandel Movie Updates
తాజాగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో పడింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల ఫిబ్రవరి 7న విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. దీంతో ఇప్పటి నుంచే తండేల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
తాజాగా రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకుల మనసు దోచుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తుండడం విశేషం. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార కుటుంబం లో చోటు చేసుకున్న యధార్థ ఘటన ఆధారంగా దర్శకుడు తండేల్ ను చిత్రీకరించాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 23న మూవీ సాంగ్ హైలెస్సో హైలెస్సా పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Also Read : IT Raids Shocking Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం