Thandel : గీతా ఆర్ట్స్ సమర్పణలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్(Thandel) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఇతివృత్తానికి సంబంధించిన కథ. ఇప్పటికే విడుదలైన పాటలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ప్రత్యేకించి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మరోసారి తన పాత్రకు జీవం పోసింది. నిజ జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా సన్నివేశాలను గుండెకు హత్తుకునేలా తీశాడు డైరెక్టర్.
Thandel Movie Updates
గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు తండేల్ మూవీని. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగ చైతన్య, సాయి పల్లవి. ఇది అద్భుతమైన దృశ్య కావ్యమని, దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తన సినీ కెరీర్ లో మరిచి పోలేని చిత్రంగా మిగిలి పోవడం ఖాయమన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, సక్సెస్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఇద్దరం కలిసి మనసు పెట్టి తీశాం. ఇక సాయి పల్లవి గురించి చెప్పేందుకు ఏం ఉంటుందని ప్రశ్నించాడు నాగ చైతన్య. మరోసారి ఛాన్స్ అంటూ వస్తే తనతోనే సినిమాలో నటించాలని ఉందన్నాడు. దీనిపై స్పందించిన సాయి పల్లవి అయితే తన కెరీర్ లో తాను ఎక్కువగా ఇష్టపడే నటులలో నాగ చైతన్య ఒకడంటూ కితాబు ఇచ్చింది.
Also Read : Beauty Samyuktha :కుంభ మేళాలో సంయుక్త మీనన్