Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు. పుట్టినరోజు నాడు చైతన్య(Naga Chaitanya) కొత్త సినిమాను ప్రకటించారు. ‘ఎన్‌సీ24’ పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి ఈ చిత్రం రానుంది. కార్తిక్ దండు దర్శకత్వంలో పౌరాణిక కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. విరూపాక్ష, కాంతార సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీ యెన్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Naga Chaitanya Movie Updates
నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’తో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక. చైతన్య రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. నాగ చైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, తండేల్ మేకర్స్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేతిలో బరువైన యాంకర్‌ను పట్టుకుని, తుఫాను మధ్య ఓడపై నాగ చైతన్య నిలబడి కనిపించారు, అతని ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, పవర్ ఫుల్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది. పొడవాటి జుట్టు, మ్యాసీ గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించారు.
Also Read : Mohan Babu : భావోద్వేగానికి గురైన టాలీవుడ్ అగ్ర నటుడు మోహన్ బాబు