Nag Ashwin: అగ్ర కథానాయకుల సినిమాలు సెట్స్ పై ఉండగా అనేక ఊహాగానాలు, వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ మూవీకి సంబంధించిన పోస్టర్, టీజర్ విడుదల చేస్తే, వేరే భాషల్లో విడుదలైన చిత్రాలను పోలుస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’కి కూడా ఇదే సమస్య ఎదురైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసి, హాలీవుడ్ మూవీ ‘డ్యూన్’ను కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అడిగితే ఒక్కసారిగా నవ్వేసి అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
Nag Ashwin Reply
ఇటీవల నిర్వహించిన మూవీ గోయెర్స్ ఈవెంట్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) పాల్గొనగా… ‘కల్కిని హాలీవుడ్ చిత్రం డ్యూన్‌తో పోలుస్తున్నారు కదా. మీ అభిప్రాయం ఏంటి’ అని అడగ్గా… ‘అవునా… బహుశా మీరు సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉండవచ్చు. మీరు ఇసుక ఎక్కడ చూసినా డ్యూన్ మూవీలానే కనిపిస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. ‘కల్కి’ని ఇలా వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ పలు సినిమాల రిఫరెన్స్‌లు ఉన్నాయంటూ రాసుకొచ్చారు. ఏదేమైనా ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంలో అమితాబ్ పోషిస్తున్న ‘అశ్వత్థామ’ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది.
వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : Aamir Khan: రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా – ఆమిర్ ఖాన్