Nag Ashwin : బాలీవుడ్ నటుడు అర్షద్ వ్యాఖ్యలపై స్పందించిన కల్కి దర్శకుడు

అర్షద్‌ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది...

Hello Telugu - Nag Ashwin

Nag Ashwin : బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ ‘కల్కి’ చిత్రంలో ప్రభాస్‌ పాత్రపై చేసిన వ్యాఖ్యలపై అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తక్షణమే ప్రభాస్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కి సంబంధించి హీరోలు, దర్శకులు ఆయా మాధ్యమాల ద్వారా మండిపడ్డ సంగతి తెలిసిందే! తాజాగా కల్కి చిత్ర దర్శకుడు వార్సీ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ కల్కి’ సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్ట్‌ చేసిన నెటిజన్‌.. ఈ ఒక్క సీన్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తంతో సమానం అని క్యాప్షన్‌ పెట్టారు.

ఈ పోస్ట్‌పై నాగ్‌అశ్విన్‌(Nag Ashwin) స్పందిస్తూ.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని విడదీసి మాట్లాడొద్దన్నారు. ‘‘నార్త్‌-సౌత్‌, టాలీవుడ్‌ వెర్సస్‌ బాలీవుడ్‌.. ఇలా కంపేర్ చేస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందిన వాళ్లమే. అర్షద్‌ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. మేము అతడి పిల్లల కోసం ‘కల్కి’ బుజ్జి బొమ్మలు పంపిస్తాం. కల్కి రెండో భాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్‌ను ది బెస్ట్‌గా తెరపై చూపిస్తాను’’ అని రాసుకొచ్చారు. ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. వాటిని పక్కనపెట్టి ముందుకెళ్లాలి. ప్రభాస్‌ కూడా ఇదే చెబుతుంటారు’’ అని నాగ్‌ అశ్విన్ అన్నారు.

Nag Ashwin Comment

ఇదే అంశంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు బాలీవుడ్‌ మూవీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు లేఖ రాశారు. ‘‘ అభిప్రాయాల్ని వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, అర్షద్‌ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్‌ను తక్కువ చేసేలా ఉన్నాయి. వ్యతిరేకతకు కారణమయ్యేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయనను హెచ్చరిస్తారని ఆశిస్తున్నాం. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా నటీనటులంతా గౌరవంగా ఉండాలని కోరుతున్నాం. మనమంతా ఒకే కుటుంబంలో భాగమని గుర్తుంచుకోవాలి. ఈ ఐక్యతని కాపాడుకుందాం’’ అంటూ అసోసియేషన్‌ అధ్యక్షరాలు పూనమ్‌ థిల్లాన్‌కు రాసిన లేఖలో విష్ణు పేర్కొన్నారు.

Also Read : N Convention : కింగ్ నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ నేలమట్టం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com