Nag Ashwin : ఒక టెక్నాలజీ మీట్ లో కల్కి డైరెక్టర్ టైటిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

మహాభారతం, స్టార్ వార్స్ రెండూ చూస్తూ, వింటూ పెరిగాను

Hello Telugu- Nag Ashwin

Nag Ashwin : దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) ప్రభాస్ నటించిన ‘కల్కి, 2989 AD’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల, నాగ్ అశ్విన్ సినాప్స్ అనే టెక్నాలజీ మరియు మైథాలజీ మీట్‌కు హాజరయ్యారు. అక్కడ ‘కల్కి’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Nag Ashwin Comments Viral

మహాభారతం, స్టార్ వార్స్ రెండూ చూస్తూ, వింటూ పెరిగాను… ఈ రెండు ప్రపంచాలను కలిపే ఓ గొప్ప సినిమా తీయాలనుకున్నప్పుడు పుట్టింది ‘కల్కి 2898 AD’. సినిమా కూడా మహాభారత కాలంలోనే మొదలై 2898లో ముగుస్తుంది. అందుకే ఈ సినిమాకి ఈ టైటిల్‌ పెట్టాం. ఈ సినిమా 6000 సంవత్సరాల క్రితం నాటి కథ. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ భారతీయ పురాణాల చుట్టూ తిరుగుతాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా చూపించే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో, మేము ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించాము.

ఈ సినిమా ఈ ఏడాది మే 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్విని దత్తా నిర్మిస్తున్నారు. “జస్ట్ ది వార్మ్ అప్” అనే క్యాప్షన్‌తో ఇటీవల విడుదల చేసిన వీడియో అకట్టుకుంది.

Also Read : Operation Valentine: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాపై మెగాస్టార్ ప్రశంసల వర్షం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com