Naalo Yedho Song : తాజాగా సంతాన ప్రాప్తిరస్తు చిత్రం నుంచి పాట విడుదలైంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యువతీ యువకుల కలలకు రెక్కలు తొడిగేలా చేసింది నాలో ఏదో మొదలైందనీ..నీతో చెలిమే రుజువైందనీ పాట. సునీల్ కశ్యప్ మరోసారి గుండెలను మెలిపెట్టేలా స్వర పరిచారు. ఈ పాట సినిమాకు హైలెట్ గా మారనుంది. ఇందులో విక్రాంత్..చాందిని చౌదరి నటించారు. మధుర మీడియా సంస్థ ద్వారా రిలీజ్ చేశారు సాంగ్ ను. మంచి ఫీల్ గుడ్ కలిగించింది.
Naalo Yedho Song Sensational
ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలలో ఎన్నదగిన పాట అని చెప్పక తప్పదు. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించగా ఈ పాటను శ్రీజో రాశారు. సంగీత దర్శకుడు, దర్శకుడి అంచనాలకు మించి గాయనీ గాయకులు దినకర్ కల్వల, అదితి భావరాజు పాడారు. కలకాలం గుర్తుంచుకునేలా వెంటాడేలా మైమరిచి పోయేలా చేశారు. సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu)కు కథ , స్క్రీన్ ప్లే షేక్ దావుద్ జీ, సంజీవ రెడ్డి అందించారు. మహి రెడ్డి పండుగుల సినిమాటో్రాఫర్ కాగా, కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ రాశారు.
ఘోస్ట్ స్టూడియోస్ ద్వారా లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు తగినట్టుగా అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు సంజీవ రెడ్డి. దర్శకుడితో పాటు ఈ సినిమాలో పాలు పంచుకున్నారు పులిచెర్ల పూర్ణ, నగేష్ లావూరి, శేఖర్ చెల్లి, వినోద్ యడ్లపల్లి, తరగళ్ల మోహిత్ వర్ధన్. ఖాదర్ బాబా సయ్యద్, పోతుల బ్రహ్మ లోకేష్, పాటిల్ సుబ్బారెడ్డి.
Also Read : Surabhi Lakshmi Shocking :ముద్దు సహజం దానికెందుకు అభ్యంతరం