అటు సినిమాలో ఇటు బుల్లి తెరపై తనకంటూ ఎదురే లేదని ప్రయత్నం చేస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. వయసు మీద పడుతున్నా మనోడు మరింత యంగ్ గా తయారవుతున్నాడు. ఓ వైపు మెగాస్టార్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. ఆ మధ్యన తనయుడితో కలిసి సినిమా చేశాడు. ఇందులో కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా నటించారు. ఆ సినిమా యావరేజ్ గా నడిచింది.
తాజాగా నా సామి రంగా అనే చిత్రంలో కీలక రోల్ పోషిస్తున్నాడు కింగ్ నాగార్జున. చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఓ వైపు స్టార్ మాలో బిగ్ బాస్ హోస్ట్ చేస్తూనే మరో వైపు కొత్త చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగార్జున.
ఇప్పటి వరకు ఎవరు హీరోయిన్లుగా ఉంటారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఆ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అమీగోస్ మూవీలో నటించిన ఆషికా రంగనాథ్ , జైలర్, ఉగ్రంలో మెప్పించిన మీర్నా మీనన్ కన్ ఫర్మ్ అయ్యారని సమాచారం. ఇందులో నాగ్ తో పాటు అల్లరి నరేష్ కూడా నటిస్తుండడం విశేషం.