AR Rahman : ప్రముఖ సంగీత దర్శకు ఏఆర్ రెహమాన్ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో హుటా హుటిన కుటుంబీకులు చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు తనను. గత రాత్రి ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చారు. అయితే డీ హైడ్రేషన్ కు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. రంజాన్ సందర్బంగా ఉపవాసం ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయట పడ్డారని, రెహమాన్ ఆరోగ్యం పదిలంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
AR Rahman Health Updates
ఇదిలా ఉండగా ఏఆర్ రెహమాన్(AR Rahman) పూర్తి పేరు అల్లా రఖా రెహమాన్. ఆయన పుట్టుకతో హిందువు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారారు. తను ఇటీవలే భార్యకు విడాకులు ఇచ్చారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సంగీత స్వరకర్తగా గుర్తింపు పొందాడు. ప్రసిద్ది చెందిన వాయిద్యకారులలో తను టాపర్ గా ఉంటూ వచ్చాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు ఏఆర్ రెహమాన్. ఆస్కార్ అవార్డు విన్నర్ కూడా.
తన సంగీత కెరీర్ లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు అకాడమీ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక బీఎఫ్టీఏ అవార్డు, ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆరు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు , 18 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు అందుకున్నాడు. భారత దేశ ప్రభుత్వం రెహమాన్(AR Rahman) ను పద్మ భూషణ్ తో సత్కరించింది.
1990లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన రోజాతో తన రెహమాన్ తన జెర్నీని ప్రారంభించాడు. అంతకు ముందు ఎన్నో జింగిల్స్ కు ప్రాణం పోశాడు. రోజా బిగ్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాంబే, కాదలన్ , తిరుడ తిరుడ , జెంటిల్మెన్ చిత్రాలకు ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉన్నాయి. హాలీవుడ్ మూవీ కపుల్స్ రీ ట్రీట్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా పేరు పొందాడు. ఇదే సమయంలో స్లమ్ డాగ్ మిలియనీర్ తో ఆస్కార్ పురస్కారం అందుకున్నాడు. అంతే కాదు టైమ్ మ్యాగజైన్ ప్రపంచ ప్రభావిత 100 మంది వ్యక్తులలో రెహమాన్ ఒకరు అని పేర్కొంది.
Also Read : Popular Director Lokesh Kanagaraj :లోకేష్ కనగరాజ్ కలకాలం వర్ధిల్లు