Murthy Pratindhi2 Movie : తెలుగు మీడియాలో మూర్తి దమ్మున్న జర్నలిస్టుగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన నారా రోహిత్ హీరోగా ప్రతినిధి 2 పేరుతో సినిమా తీస్తున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
Murthy Pratindhi2 Movie Updates
ఈ చిత్రం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కు వ్యతిరకంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో సినిమా రూపొందించారు.
ఇక దిగ్గజ , వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరుతో సినిమా తీశారు. ఇది చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఝలక్ ఇచ్చారు . జర్నలిస్ట్ మూర్తి(Journalist Murthy) ఈ చిత్రంతో ఫిల్మ్ మేకర్ గా రూపాంతరం చెందాడు. ప్రతినిధి2 పేరుతో టైటిల్ ఖరారు చేశాడు.
పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఫిబ్రవరి 2024లో యాత్ర 2 సినిమా రానుంది. ఏపీలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. యాత్రకి రెండు వారాల ముందు ప్రతినిధి 2 మూవీ కూడా రిలీజ్ కానున్నట్టు టాక్.
Also Read : Ramaiah Vastavaiya Jawan : జవాన్ రామయ్య వస్తావయ్యా సూపర్