Murali Mohan : ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తనయుడు తనయుడు శ్రీ సింహకి, నటుడు మురళీ మోహన్ మనుమరాలు పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. తాజాగా మురళీమోహన్(Murali Mohan) కూడా అవన్నీ నిజమేనని ప్రకటించారు. ఈ విషయాన్ని మురళీ మోహన్ కోడలు మాగంటి రూప తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించింది. ఎం.ఎం.కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహతో తన కూతురు ‘రాగ’ వివాహం నిశ్చయమైందని ఆమె తెలిపారు. మురళీ మోహన్ కూడా సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కోడలు రూపా కూడా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉంటుందని వెల్లడించింది.
Murali Mohan Comment
సీనియర్ నటుడు మురళీ మోహన్‌కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కూతురు మాత్రం విదేశాల్లో సెటిల్ అవుతుంది. కొడుకు రామ్ మోహన్ సంబంధిత కార్యకలాపాలకు బాధ్యత వహిస్తున్నారు. రాగ రామ్ మోహన్ రూపాల కుమార్తె. ఆమె విదేశాల్లో వ్యాపారంలో మాస్టర్స్ డిగ్రీని సంపాదించింది. ప్రస్తుతం, రాగా తన కుటుంబ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. ఇక శ్రీసింహ విషయానికి వస్తే.. యమదొంగ సినిమాలో బాలనటుడుగా నటించాడు. ‘మట్టు వదలరా’ సినిమాతో హీరోగా మారాడు. ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘ఉస్తాద్’ చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : Sree Mukhi : ఆ పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి