Munjya: దుమ్ము రేపుతున్న ‘ముంజా’ సినిమా ! వంద కోట్ల క్లబ్ లో ‘ముంజా’ !

దుమ్ము రేపుతున్న 'ముంజా' సినిమా ! వంద కోట్ల క్లబ్ లో 'ముంజా' !

Hello Telugu - Munjya

Munjya: మ్యాడ్ డాక్ సూపర్ నేషనల్ యూనివర్స్ నుండి వచ్చిన నాలుగో చిత్రం ‘ముంజా‘. ఆదిత్య సపోట్‌దర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోనా సింగ్‌, అభయ్‌ వర్మ, శార్వరి వాగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్‌ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇదే విషయాన్ని ‘ముంజా’ చిత్రయూనిట్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Munjya Movie Updates

చిన్న సినిమా విడుదలై… బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది. బాలీవుడ్‌ బడా సినిమాల పోటీని తట్టుకుని నిలబడింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఈ మూవీకి ఓటేస్తున్నారు. అలా ఈ సినిమా 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్ల దూకుడికి గురువారం (జూన్‌ 27) అడ్డుకట్ట పడే అవకాశముంది. ఆ రోజు ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ సినిమా రిలీజవుతుండటంతో ముంజా రేసులో వెనకబడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ముంజా… మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, చందు ఛాంపియన్‌ వంటి భారీ చిత్రాలను వెనక్కు నెట్టి వంద కోట్ల క్లబ్ లో చేరడం గొప్ప విషయమనే చెప్పాలి.

Also Read : Guruvayoor Ambalanadayil: ఓటీటీలోనికి సూపర్ హిట్ మలయాళ ఫ్యామిలీ డ్రామా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com