Saif Ali Khan : ముంబై – బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కీలక ప్రకటన చేశారు. గురువారం ముంబై పోలీస్ జోన్ -9 డీసీపీ దీక్షిత్ గెడెమ్ మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి నిందితులు సైఫ్(Saif Ali Khan) ఇంట్లోకి ప్రవేశించారని, ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించారని తెలిపారు. ఇది పూర్తిగా దోపిడీ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు డీసీపీ.
Saif Ali Khan Attack Updates
ఈ కేసుపై 10 డిటెక్షన్ బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఎందుకు దాడి జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. గుర్తు తెలియని ఆగంతకుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్లకు దిగాడని తెలిపారు. కేవలం దొంగతనం చేసేందుకే ఇంట్లోకి ప్రవేశించాడని ప్రాథమికంగా గుర్తించామన్నారు .
సైఫ్, కరీనా కపూర్ తో పాటు పని మనిషి ముందుగా గుర్తించారని వెల్లడించారు డీసీపీ దీక్షిత్ గెడెమ్. వెంటనే రంగంలోకి దిగిన సైఫ్ అలీ ఖాన్ అతడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఆరు సార్లు పొడిచాడని, దీంతో తీవ్రంగా గాయపడ్డాడడని చెప్పారు.
ప్రస్తుతానికి సీసీటీవీ కెమెరాలో ఇద్దరు అనుమానితులను గుర్తించామన్నారు. ఇద్దరిలో ఒక నిందితుడిని గుర్తించామన్నారు. మెట్ల సాయంతో ఇంట్లోకి వచ్చాడన్నారు. దాడి జరిగిన సమయంలో భార్య , నటి కరీనా కపూర్ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. పని మనిషి వాంగ్మూలం నమోదు చేశామన్నారు.
Also Read : Hero Jr NTR – saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలి – తారక్