Mrunal Thakur Viral : మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సినీ రంగంలో నటిస్తున్న హీరోయిన్ల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తమ నటన గురించి పట్టించుకోరని, కేవలం అందరి కళ్లు కేవలం తమ భాగాల పైనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Mrunal Thakur Viral Looks
ఈ ముద్దుగుమ్మను ఏరికోరి తీసుకున్నారు నిర్మాత అశ్వనీ దత్. ఆయన దుల్కర్ సల్మాన్ తో కలిసి సీతారామం తీశాడు. ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం నానితో హాయ్ నాన్న మూవీలో నటిస్తోంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. నటీ నటులను సాధారణ మనుషులుగా చూడడం లేదని, వాళ్ల కళ్లన్నీ అందాలపైనే ఉంటున్నాయంటూ సంచలన కామెంట్స్ చేసింది మృణాల్ ఠాకూర్.
Also Read : Kamalhaasan : రియల్ సూపర్ స్టార్ కృష్ణ